Wedding Card: 'మోదీకి ఓటు వేయడమే నా పెళ్లికి మీరిచ్చే కానుక': తెలంగాణ యువకుడి వినూత్న వెడ్డింగ్ కార్డు!

  • మోదీపై అభిమానాన్ని చూపించిన ముఖేష్ రావు
  • మోదీకి ఓటు వేయడమే పెద్ద బహుమతి
  • 'ఓట్ ఫర్ మోదీ' అని వెడ్డింగ్ కార్డుపై అక్షరాలు

తమకు నచ్చిన పొలిటికల్ లీడర్స్ పై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా బయటపెడుతూ ఉంటారు. తెలంగాణకు చెందిన ఓ యువకుడు, ఇంకాస్త వినూత్నంగా ఆలోచించి, ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చూపించాడు. ఈ నెల 21న పెళ్లి చేసుకోనున్న శంషాబాద్ కు చెందిన దంపతులు సుభాష్ రావ్ కిషన్ రావు, అంబికా బాయి దంపతుల కుమారుడు ముఖేష్ రావు, వివాహానికి వచ్చే అతిథులు ఎలాంటి బహుమతులూ తీసుకు రావద్దని, అందుకు బదులుగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోదీకి ఓటు వేయాలని, అదే తనకు పెద్ద బహుమతని వెడ్డింగ్ కార్డుపై ముద్రించాడు. ఆపై 'ఓట్ ఫర్ మోదీ' అంటూ కమలం గుర్తును సైతం ముద్రించగా, దీన్ని అందుకున్న వారు ఆశ్యర్యానికి లోనవుతున్నారు. మోదీ స్ఫూర్తితో తాను ప్రతి నెలా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నానని, ఆయనే మరోసారి ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా ముఖేష్ రావు వ్యాఖ్యానించారు.

Wedding Card
Telangana
Marriage
Narendra Modi
Vote
  • Loading...

More Telugu News