Chandrababu: ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో బలిదానం చేసిన అర్జునరావు.. రూ. 20 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు

  • ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాకుళం వాసి
  • అర్జునరావుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
  • హోదా కోసం బలిదానాలు వద్దన్న చంద్రబాబు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాకుళం వాసి దావాల అర్జునరావు (40) కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు.  విభజిత ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం వైఖరికి నిరసగా ఢిల్లీలో సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అర్జునరావు (40) మృతి విషయం తెలిసి సీఎం చలించిపోయారు.

దీక్ష విరమణ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందాం తప్పితే ప్రాణాలు తీసుకోవద్దని, కుటుంబాలను అనాథలను చేయవద్దని అన్నారు. అర్జునరావు కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు అధికారిక లాంఛనాలతో అతడి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Chandrababu
Andhra Pradesh
Special Category Status
New Delhi
Srikakulam District
  • Loading...

More Telugu News