NagaJhansi: టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో ప్రియుడు సూర్యతేజ అరెస్ట్!

  • గత వారంలో నాగఝాన్సీ సూసైడ్
  • సూర్యతేజపై ఐపీసీ 306, 417 సెక్షన్ల కింద కేసు
  • ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న పోలీసులు

టీవీ నటి, 'పవిత్రబంధం' ఫేమ్ నాగఝాన్సీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు సూర్యతేజను సోమవారం రాత్రి పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్యకు ప్రత్యక్షంగా కారణంకాక పోయినా, తన చర్యలతో అందుకు ప్రేరేపించారన్న కోణంలో సూర్యతేజపై అభియోగాలను సిద్ధం చేసినట్టు పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

ఇద్దరూ ప్రేమలో ఉన్నారన్న మాట వాస్తవమని, వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని, సీరియళ్లలో నటించవద్దని హెచ్చరిస్తే ఆమె మానుకుందని తెలిపారు. సూర్యతేజను కలవాలని ఆమె ఎంతో ప్రయత్నించిందని, మాట్లాడాలని చెప్పినా సూర్యతేజ స్పందించలేదని, అందుకే మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు.

సూర్యతేజపై ఐపీసీ సెక్షన్ 306, 417ల కింద కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. సూర్యతేజపై కేసు పెట్టేముందు న్యాయనిపుణుల సలహాను, సీపీ అంజనీ కుమార్ సూచనలను తీసుకున్నట్టు చెప్పారు. కాగా, నాగ ఝాన్సీకి చెందిన ఒక సెల్ ఫోన్ లాక్ ఇంకా ఓపెన్ కాలేదని తెలుస్తోంది.

NagaJhansi
Sucide
Police
Surya Teja
Arrest
  • Loading...

More Telugu News