Mahendra singah Dhoni: ఇంతకంటే సంతోషించే సందర్భం మరొకటి ఉండదు: ధోనీ గురువు ఏకే సింగ్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-84b5caae940f162151feb736ad3b33d3427fcd4f.jpg)
- ధోనీ యువతకు ఆదర్శం
- దేశభక్తికి బ్రాండ్ అంబాసిడర్
- ధోనీని చూస్తుంటే గర్వంగా ఉంది
న్యూజిలాండ్తో జరిగిన టీ 20లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా ఓ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకుని కీపింగ్ చేస్తున్న మహేంద్రసింగ్ ధోని వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి పాదాభివందనం చేశాడు. ఆ సమయంలో అతడి చేతిలో ఉన్న భారత పతాకం కింద పడబోతుంటే.. వెంటనే అప్రమత్తమైన ధోనీ అది కిందపడకుండా పట్టుకున్నాడు.
ఇది చూసిన అభిమానులు ధోనీ దేశభక్తికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనిని చూసిన ధోనీ చిన్ననాటి గురువు, జవహర్ విద్యా మందిర్ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఏకే సింగ్ మాట్లాడుతూ.. ధోనీ యువతకు ఆదర్శమని.. తనని చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు. దేశభక్తికి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడని కితాబిచ్చారు. ఒక గురువుగా ఇంతకంటే సంతోషించే సందర్భం మరొకటి ఉండదని పేర్కొన్నారు.