Rafel Deal: బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా కాగ్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్రం!
- రాఫెల్ ఒప్పందంపై తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ఫైర్
- తాజాగా కాగ్‌పై కూడా విమర్శలు
- రాజీవ్ మహర్షి ఆడిట్ నుంచి వైదొలగాలని డిమాండ్
రాఫెల్ డీల్‌పై కాగ్ నివేదికను రేపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. రేపటితో బడ్జెట్ సమావేశాలు ముగియనుండటంతో కాగ్ నివేదికను ఉభయ సభల ముందుకు తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాఫెల్ ఒప్పందంపై కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న కాంగ్రెస్ తాజాగా కాగ్‌పై కూడా విమర్శలు గుప్పించింది. ఈ ఒప్పందం వ్యవహారంలో కాగ్ ఛైర్మన్ రాజీవ్ మహర్షి ఆడిట్ నుంచి వైదొలగాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. మరోపక్క, కాగ్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు.