Jayaram: జయరాం హత్య కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్

  • న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు
  • నందిగామలో నమోదైన జయరాం హత్యకేసు
  • తెలంగాణకు బదిలీ చేసిన ఏపీ పోలీసులు

సంచలనం సృష్టించిన కోస్టల్‌బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరాం హత్యకేసు నిందితులు రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు నేడు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. వారిద్దరికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. మొదట జయరాం హత్యకేసు నందిగామలో నమోదైంది. అయితే హత్య హైదరాబాద్‌లో జరిగినందున ఏపీ పోలీసులు తెలంగాణకు బదిలీ చేయడంతో తెలంగాణ పోలీసులు మళ్లీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా నిందితులను కస్టడీకి కోరుతూ పోలీసులు రేపు నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు.

Jayaram
Coastal Bank
Srinivas
Rakesh Reddy
Nampally Court
Chanchalguda Jail
  • Loading...

More Telugu News