Murali Mohan: రజనీ ఇంట్లో పెళ్లి కంటే దీక్ష ముఖ్యమని సభాస్థలికి వచ్చారు: శత్రుఘ్నసిన్హాపై మురళీ మోహన్ ప్రశంసలు

  • రజనీకాంత్ కుమార్తె వివాహానికి హాజరు కావల్సి ఉంది
  • దీక్ష ముఖ్యమని ఫ్లైట్ టికెట్ రద్దు చేసుకున్నారు
  • టీడీపీ, ఆంధ్రప్రదేశ్ తరుపున కృతజ్ఞతలు

సినీ నటుడు, బీజేపీ అసమ్మతి నేత శత్రుఘ్నసిన్హాపై టీడీపీ ఎంపీ మురళీ మోహన్ ప్రశంసల వర్షం కురిపించారు. నేడు టీడీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. చెన్నైలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో శత్రుఘ్నసిన్హా వివాహానికి హాజరు కావాల్సి ఉండగా.. మానేసి మరీ దీక్షకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. శత్రుఘ్నసిన్హాకు ఎంతో ముఖ్య స్నేహితుడు అయిన రజనీకాంత్ కుమార్తె వివాహానికి హాజరు కావల్సి ఉండగా.. దానిని పక్కనబెట్టి మరీ ధర్మపోరాట దీక్షకు వచ్చారని కొనియాడారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్ష గురించి తెలుసుకున్న శత్రుఘ్నసిన్హా.. పెళ్లి కంటే దీక్ష ముఖ్యమని భావించి ఫ్లైట్ టికెట్ రద్దు  చేసుకుని సభాస్థలికి వచ్చారని మురళీమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ, ఆంధ్రప్రదేశ్ తరుపున శత్రుఘ్నసిన్హాకు కృతజ్ఞతలు తెలిపారు.

Murali Mohan
Satrugnasinha
Andhra Pradesh
Chandrababu
Telugudesam
BJP
Rajanikanth
  • Loading...

More Telugu News