Andhra Pradesh: చంద్రబాబు దీక్షకు అనూహ్య మద్దతు.. సంఘీభావం తెలిపిన బీజేపీ నేతలు శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా!

  • దీక్షా స్థలి వద్దకు చేరుకున్న నేతలు
  • బీజేపీ హైకమాండ్ వైఖరిపై ఆగ్రహం
  • మరికాసేపట్లో ముగియనున్న ధర్మపోరాట దీక్ష

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు అనూహ్య మద్దతు లభించింది. ఇప్పటికే విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు ఏపీ సీఎంకు మద్దతు తెలపగా, ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఈ జాబితాలో చేరారు.

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గళమెత్తుతున్న బీజేపీ రెబెల్ నేతలు శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపారు. బీజేపీ కండువాలతో సభకు చేరుకున్న బీజేపీ నేతలు కేంద్రం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ఈరోజు రాత్రి 8 గంటలకు ముగియనుంది. 

Andhra Pradesh
Chandrababu
Telugudesam
yaswant sinha
satrugna sinha
  • Loading...

More Telugu News