Andhra Pradesh: స్టిక్కర్ బాబూ.. అధికారం కోసం ఇంత దారుణంగా దిగజారుతావా?: కన్నా లక్ష్మీనారాయణ

  • హోదా కోసం కాంగ్రెస్ తో పొత్తని చెప్పావ్
  • ఏపీలో ఒంటరిగా పోరుకు తయారయ్యావు
  • నువ్వు సిగ్గుపడాలి యూటర్న్ బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఆయన స్టిక్కర్ బాబుగా అభివర్ణించారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీకి ప్రత్యేకహోదా కోసమే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారం కోసం ఇంతలా దిగజారుతావా? అని ప్రశ్నించారు.

కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘‘స్టిక్కర్ బాబు..! తెలంగాణ ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ తో  పొత్తు అన్నావ్. ఇప్పుడేమో ఏపీలో ఒంటరి పోరుకు తయారయ్యావు. మళ్లీ ఇప్పుడు వైసీపీ పొత్తు విషయం స్వయంగా బయటపెట్టావ్..! అధికారం కోసం ఇంత దారుణంగా దిగజారుతావా?? "Shame On You U-Turn Babu" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు వైసీపీ, టీడీపీ, చంద్రబాబులను ట్యాగ్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
BJP
kanna
lakshmi narayana
Telangana
u turn babu
  • Loading...

More Telugu News