Andhra Pradesh: పవన్ కల్యాణ్ కోసం సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తా!: తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు

  • పోరాడే నాయకుడి కోసం ప్రజల ఎదురుచూపు
  • యువత, మహిళల కోసం రేయింబవళ్లు పనిచేస్తున్నారు
  • జనసేనానిని ప్రశంసించిన తమిళనాడు మాజీ సీఎస్

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు నిజాయతీపరుడైన, తమకోసం పోరాడే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారని తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని వ్యాఖ్యానించారు. ఏపీలో చాలా బలమైన శక్తులు పోటీ పడుతున్నాయని, రాజకీయం నడుపుతున్నాయని పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి పవన్ కల్యాణ్ సమక్షంలో ఈరోజు జనసేనలో చేరిన అనంతరం రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు.

యువత, పేదలు, మహిళల సంక్షేమం కోసం పవన్ రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని రామ్మోహన్ రావు కితాబిచ్చారు. పవన్ కల్యాణ్ అన్న చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులతో తనకు పరిచయం ఉందని తెలిపారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడం అన్నది చారిత్రక అవసరమని వ్యాఖ్యానించారు. పవన్ కోసం సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తానని హామీ ఇచ్చారు. పవన్ ను సీఎం పదవిలో చూడటానికి తనతో పాటు ప్రజలు ఆసక్తిగా ఉన్నారన్నారు.

Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
join
rammohan rao
Tamilnadu ex CS
Vijayawada
  • Error fetching data: Network response was not ok

More Telugu News