Yadyurappa: బేరసారాల వివాదంపై... సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన సీఎం కుమారస్వామి

  • సిట్‌ను ఏర్పాటు చేయాలని కోరిన స్పీకర్
  • స్పీకర్‌పై ఆరోపణలు బాధించాయన్న సీఎం
  • స్పీకర్ కార్యాలయాన్ని కాపాడాలన్న సభ్యులు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్పకు షాక్ ఇచ్చారు. జేడీఎస్ ఎమ్మెల్యేతో యడ్యూరప్ప బేరసారాల వివాదంలో తన పేరును కూడా లాగారని.. దీనిపై నిజానిజాలు తెలియాలంటే సిట్‌ను ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీ వేదికగా స్పీకర్ రమేశ్ కుమార్ కోరారు. దీంతో ముఖ్యమంత్రి సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రమేశ్ కుమార్‌పై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు తనను కూడా బాధించాయని.. అందుకే సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కుమారస్వామి ప్రకటించారు.

మరోవైపు సభ్యులంతా స్పీకర్ రమేశ్ కుమార్ నిజాయతీకి, గౌరవానికి మారుపేరని.. అలాంటి వ్యక్తిపై ఈ తరహా ఆరోపణలు తగవనీ.. ఆయన కార్యాలయాన్ని కాపాడాలని కోరారు. అయితే సిట్ విచారణను స్పీకర్ వరకే పరిమితం చేయాలని బీజేపీ కోరగా.. కేవలం నిజానిజాలను వెలుగులోకి తెచ్చేందుకే సిట్‌ను ఏర్పాటు చేశాము తప్ప ఎవరినీ వెంటాడేందుకు కాదని కుమారస్వామి తెలిపారు. 

Yadyurappa
kumaraswami
Ramesh Kumar
Karnataka
BJP
  • Loading...

More Telugu News