ROMANTIC: 'రొమాంటిక్' టైటిల్ తో ఆకాష్ పూరి కొత్త సినిమా

  • కాసేపటి క్రితం ముహూర్తపు కార్యక్రమం   
  • నిర్మాతలుగా ఛార్మి, పూరి జగన్నాథ్
  • రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి నటిస్తోన్న కొత్త సినిమాకి 'రొమాంటిక్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కాసేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తపు కార్యక్రమాలు జరిగాయి. ఈ ముహూర్తపు వేడుకకు సీనియర్ నటి రమాప్రభ, హీరో నందమూరి కల్యాణ్ రామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కానుంది. కాగా, ఆకాష్ సరసన ‘గాయత్రీ భరద్వాజ్’ అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకుంటారని తెలుస్తోంది.

ROMANTIC
AkashPuri
Tollywood
cinema
Film Launch
  • Loading...

More Telugu News