hollywood: ‘అలాదీన్’ సినిమా ట్రైలర్ విడుదల.. జీనీగా అదరగొట్టిన సూపర్ స్టార్ విల్ స్మిత్!

  • అరేబియన్ జానపద కథతో సినిమా
  • తెరకెక్కించిన దర్శకుడు గుయ్ రిట్జీ
  • 2019, మే 24న రిలీజ్ కు సన్నాహాలు

అలాదీన్, ఆలీబాబా 40 దొంగల కథలు విననివారు ఎవరూ ఉండరేమో. ఓ మాంత్రికుడు మాయా దీపాన్ని తీసుకురావాలని అలాదీన్ ను గజదొంగ ఆలీబాబాకు చెందిన గుహలోకి పంపడం, అలాదీన్ కు జీనీ సాయం చేయడం, చక్రవర్తి కుమార్తెను అలాదీన్ పెళ్లి చేసుకోవడం ఇతివృత్తంగా ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా అలాదీన్ సినిమాను తెరకెక్కిస్తున్న డీసీ సంస్థ.. అందుకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది.

హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్, నయోమి స్కాట్, మేనా మస్సుద్ ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. విల్ స్మిత్ ‘అలాదీన్’లో జీనీగా నటించారు. షెర్లాక్ హోమ్స్ సినిమాలను తెరకెక్కించిన గుయ్ రిట్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2019, మే 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ట్రైలర్ ను మీరూ చూసేయండి.

hollywood
arabian nights
alibaba
aladdin
trailer
DC
  • Error fetching data: Network response was not ok

More Telugu News