New Delhi: అందరి కళ్లూ ఆమెపైనే... తెలుగుతల్లి వేషంలో సాధినేని యామిని!

  • న్యూఢిల్లీలో ధర్మపోరాట దీక్ష
  • పలువురిని ఆకర్షించిన సాధినేని యామినీ శర్మ
  • తన కుమారుడు జగన్ దారితప్పి తిరుగుతున్నాడని వ్యాఖ్య

న్యూఢిల్లీలో జరుగుతున్న ధర్మపోరాట దీక్షలో తెలుగుతల్లి వేషంలో వచ్చిన టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ, అందరి దృష్టినీ ఆకర్షించారు. "నా తల్లి భరత మాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం" స్లోగన్ రాసున్న ప్లకార్డును పట్టుకుని వేదికపై యామిని తిరుగుతూ ఉంటే, పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.

ఇక ఆమె మాట్లాడుతూ, తన ఓ కుమారుడు చంద్రబాబునాయుడు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మోదీని నిలదీస్తూ, అలుపెరగని పోరాటం చేస్తుంటే, మరో కుమారుడు వైఎస్ జగన్ అదే మోదీకి మద్దతిస్తూ, ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించిన సమయంలో దీక్షా స్థలి చప్పట్లతో మారుమోగింది. తన కుమారుడు దారితప్పి తిరుగుతున్నాడని, అతన్ని దారిలోకి తెచ్చే బాధ్యత ప్రజలదేనని అన్నారు.

దీక్షకు వచ్చిన వారితో ఏపీ భవన్ నిండిపోవడంతో, పక్కనే ఉన్న కేరళ హౌస్ లోనూ వందల మందికి ఆశ్రయం కల్పించారు. యామినీ శర్మ కూడా కేరళ హౌస్ లో బసచేసి, అక్కడి నుంచి తెలుగుతల్లి వేషంలో రోడ్డుపై నడుస్తూ వేదిక వద్దకు వచ్చారు.

New Delhi
Sadhineni Yamini
Telugutalli
  • Loading...

More Telugu News