Tollywood: రాజన్నే స్క్రీన్ మీదకు వచ్చేశాడా అనిపించింది.. ’యాత్ర’ టీమ్ పై సురేందర్ రెడ్డి ప్రశంసలు!

- యాత్ర సినిమా నిజంగా ఎమోషనల్ జర్నీనే
- చాలా సీన్లలో భావోద్వేగానికి లోనయ్యాను
- ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు
వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా మహి.వి.రాఘవ్ ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి యాత్ర సినిమాపై ప్రశంసలు కురిపించారు. యాత్రను అద్భుతంగా తెరకెక్కించిన చిత్ర యూనిట్ ను అభినందించారు.
