Andhra Pradesh: మాదేమన్నా ‘నిప్పు ఫాదర్ ఆఫ్ పప్పు’ తెలివితేటలు అనుకున్నావా చంద్రబాబూ?: కొడాలి నాని ఆగ్రహం

  • గుంటూరు సభకు గుడివాడలో పోస్టర్లు
  • టీడీపీ నేతలపై వైసీపీ నేత నాని ఫైర్
  • ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టీకరణ

ప్రధాని మోదీ గుంటూరు సభ సందర్భంగా నిన్న బీజేపీ-వైసీపీ పోస్టర్లు గుడివాడలో ప్రత్యక్షమయిన సంగతి తెలిసిందే. దీంతో ఇది టీడీపీ నేతల పనేనని గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుపై నాని నిప్పులు చెరిగారు. తమకు స్ట్రెయిట్ ఫార్వర్డ్ రాజకీయాలు మాత్రమే తెలుసనీ, చంద్రబాబులా మానిపులేటెడ్ చీప్ ట్రిక్స్ చేయబోమని వ్యాఖ్యానించారు.

కొడాలి నాని ట్విట్టర్ లో స్పందిస్తూ..‘మాకు తెలిసింది స్ట్రెయిట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ మాత్రమే.. మీలా మానిపులేటెడ్ చీప్ ట్రిక్స్ తెలియవు. అక్కడ గుంటూరులో మోడీ సభకు ఇక్కడ గుడివాడలో పోస్టర్స్ వేయించడానికి మాదేమన్నా నిప్పు ఫాదర్ ఆఫ్ పప్పు తెలివితేటలు అనుకున్నవా బాబూ? మాది ఒక్కటే సిద్ధాంతం ఒకటే మాట.. ఒంటరిగా పోటీచేస్తాం’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Kodali Nani
gudiwada
  • Loading...

More Telugu News