Kerala: ఆమెకు బుర్రలేదు.. మహిళా ఐఏఎస్‌పై అధికారపార్టీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

  • సబ్‌ కలెక్టర్‌పై నోరు పారేసుకున్న కేరళ ఎమ్మెల్యే
  • కలెక్టర్ అవుదామని చదువుకున్న వాళ్లకు బుర్ర ఉండదని ఎద్దేవా
  • దుమారం రేపుతున్న ఎమ్మెల్యే వ్యాఖ్యలు

‘‘ఆమెకు అసలు బుర్ర లేదు. ఏదో ఐఏఎస్ అయింది కాబట్టి స్మార్ట్‌గా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తోంది. కలెక్టర్ అయ్యేందుకు చదువుకునే వాళ్లంతా ఇంతే’’ అంటూ కేరళలోని అధికార సీపీఎం ఎమ్మెల్యే ఓ మహిళా ఐఏఎస్‌పై నోరుపారేసుకున్నారు. దేవికుళం ఎమ్మెల్యే ఎ.రాజేంద్రన్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

రాజేంద్రన్ నోరు పారేసుకున్న ఆమె పేరు రేణు రాజ్. దేవికుళం సబ్ కలెక్టర్. ఆమె చేసిన తప్పల్లా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్‌ను అడ్డుకోవడమే. నిర్మాణాన్ని అడ్డుకున్న రేణురాజ్‌పై ఎమ్మెల్యే రాజేంద్రన్‌కి కోపం వచ్చింది. దానిని అడ్డుకునే అధికారం ఆమెకు లేదని మండిపడ్డారు.

ఆమెకు బ్రెయిన్ లేదని, ప్లాన్, స్కెచ్ గురించి ఆమెకు ఏం తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పంచాయతీ నిర్మాణాల్లో కలెక్టర్ జోక్యం ఏంటని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్పేదే వేదమని హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యే దురుసు వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Kerala
Devikulam
S Rajendran
Renu Raj
sub-collector
CPI (M)
  • Loading...

More Telugu News