Chandrababu: అవినీతి అచ్చు వేసి ఆంబోతు లాంటి కొడుకుని రాష్ట్రం మీద వదిలావు: చంద్రబాబుపై కన్నా ఫైర్

  • అవినీతిని ప్రశ్నిస్తే ఎందుకలా ఉలిక్కి పడుతున్నావ్
  • కుటుంబ వ్యవస్థ అంటే మీలాగా దోచిపెట్టాలా?
  • సన్‌రైజ్ స్టేట్ చేస్తానని సన్‌ని మాత్రమే రైజ్ చేశావ్

ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నల్లజెండాలు, ఫ్లెక్సీలతో.. మోదీ గో బ్యాక్ నినాదాలతో ఏపీ దద్దరిల్లింది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

అవినీతి అచ్చు వేసి ఆంబోతు లాంటి కొడుకుని రాష్ట్రం మీదకు వదిలావంటూ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘అవినీతిని ప్రశ్నిస్తే ఎందుకలా ఉలిక్కి పడుతున్నావ్ "స్టికర్ సీఎం"..? బంధాలు, కుటుంబ వ్యవస్థ అంటే మీలాగా దోచిపెట్టాలా? రాష్ట్రాన్ని సన్‌రైజ్ స్టేట్ చేస్తా అని నమ్మించి నీ సన్‌ని మాత్రమే రైజ్ చేశావ్.. అవినీతి అచ్చు వేసి ఆంబోతు లాంటి కొడుకుని రాష్ట్రం మీద వదిలావు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Chandrababu
Kanna Lakshmi Narayana
Sticker CM
Andhra Pradesh
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News