Nakka Anandababu: ఈ మాటలు చెప్పడానికేనా మోదీ గుంటూరు వచ్చారు?: నక్కా ఆనందబాబు ధ్వజం

  • మోదీ తన స్థాయిని దిగజార్చుకున్నారు
  • లోకేశ్‌పై విమర్శలు భయానికి నిదర్శనం
  • ముందు తమ పార్టీ నేతలను చూడాలి

కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లే విషయమై తమ పార్టీని విమర్శించడానికి ముందు.. ప్రధాని మోదీ ముందు తమ పార్టీ నేతల వైపు చూడాలని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. ఢిల్లీలో రేపు చంద్రబాబు తలపెట్టిన ధర్మపోరాట దీక్ష ఏర్పాట్లలో ఉన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ గుంటూరులో చేసిన ప్రసంగంతో తన స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు.

ఈ మాటలు చెప్పడానికేనా ఏపీకి వచ్చారని ఎద్దేవా చేశారు. ఏపీ గురించి మోదీకేం తెలుసని ఆనందబాబు ధ్వజమెత్తారు. టీడీపీపై విమర్శలు చేయడానికి ముందు కన్నా, కావూరి లాంటి నేతలంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. లోకేశ్‌పై విమర్శలు చేయటం మోదీలో ఉన్న భయానికి నిదర్శనమని ఆనందబాబు వ్యాఖ్యానించారు.

Nakka Anandababu
Lokesh
Narendra Modi
Delhi
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News