Mitharani Jena: ఎడమకాలికి బదులు కుడికాలికి ఆపరేషన్ చేసిన వైద్యులు.. విచారణకు ఆదేశించిన కలెక్టర్

  • చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన మితారాణి
  • స్పృహలోకి వచ్చాక గ్రహించానని వెల్లడి
  • ఆసుపత్రి ఉన్నతాధికారికి ఫిర్యాదు

ఎడమ కాలికి ఆపరేషన్ చేయాల్సిన వైద్యులు కుడికాలికి ఆపరేషన్ చేసిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. భువనేశ్వర్ కు 220 కిలో మీటర్ల దూరంలోని ఆనంద్‌పూర్‌ సబ్‌డివిజన్‌ ఆస్పత్రిలో ఎడమకాలి చికిత్స నిమిత్తం కెంజార్ జిల్లాలోని కాబిల్ గ్రామానికి చెందిన మితారాణి జెనా అనే దళిత మహిళ చేరింది.

అయితే, ఆమె ఎడమ కాలికి బదులు కుడికాలికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. తాను స్పృహలోకి వచ్చిన అనంతరం అసలు విషయాన్ని గ్రహించానని బాధితురాలు ఆసుపత్రి ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కెంజార్ జిల్లా కలెక్టర్ ఆశీష్ థాక్రే విచారణకు ఆదేశించారు. విచారణానంతరం బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  

Mitharani Jena
Odisha
Anandapur
Ashish Thakre
Kenjar district
  • Loading...

More Telugu News