Janasena: తెలంగాణలో పార్టీ బలోపేతానికి చర్యలు.. పార్లమెంటరీ కమిటీలను ప్రారంభించిన జనసేన

  • నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు కమిటీలు
  • కమిటీలో 11 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు
  • 32 మంది వర్కింగ్ కమిటీ సభ్యులు

ఇప్పటి వరకూ ఆంధ్రపైనే ఎక్కువగా దృష్టి సారించిన జనసేన పార్టీ.. తాజాగా తెలంగాణలోనూ పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే సికింద్రాబాద్, ఖమ్మం, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాలకు పార్లమెంటరీ కమిటీలను ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. తాజాగా మరో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు కమిటీలను నియమించారు. వరంగల్, నల్గొండ, భువనగిరి, మెదక్ లోక్‌సభ నియోకవర్గాలకు ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలను ప్రకటించారు. ఒక్కో కమిటీలో 11 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, 32 మంది వర్కింగ్ కమిటీ సభ్యులను పవన్ నియమించారు.

Janasena
Pawan Kalyan
Khammam
Secunderabad
Warangal
Nalgonda
Medak
  • Loading...

More Telugu News