Tollywood: మహేశ్ బాబుకు ఫోన్ లో లవ్ ప్రపోజ్ చేశా.. ఆయన మహా సిగ్గరి!: నమ్రతా శిరోద్కర్

  • మహేశ్-నమ్రత వివాహబంధానికి 14 ఏళ్లు
  • మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నమ్రత
  • వంశీ షూటింగ్ లో తనతో తెగ మాట్లాడేవారని వెల్లడి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల వివాహం జరిగి నేటికి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత తాను మహేశ్ కు ఎలా ప్రపోజ్ చేసింది చెప్పుకొచ్చింది. మహేశ్ బాబు కాస్త సిగ్గరి అనీ, ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదని నమ్రత తెలిపింది.

‘‘వంశీ’ సినిమా షూటింగ్ కోసం మేమంతా న్యూజిలాండ్ వెళ్లాం. అక్కడ దాదాపు 25 రోజుల పాటు షూటింగ్ జరిగింది. నేను అప్పటివరకూ అన్నిరోజుల పాటు ఔట్ డోర్ షూటింగ్ లో పాల్గొనలేదు. మహేశ్ బాబు చాలా సిగ్గరి కదా! ఆయన ఇతరులతో ఎక్కువ మాట్లాడేవారు కాదు. కానీ నాతో బాగా మాట్లాడేవారు. అప్పటికే మా మధ్య స్నేహం కుదిరింది. న్యూజిలాండ్ నుంచి వచ్చాక ప్రేమలో ఉన్నామని ఇద్దరికీ అర్థమయింది.

మహేశ్ కు మొదటగా ఫోన్ లో నేనే ప్రపోజ్ చేశా. ఎదురెదురుగా లేము కాబట్టి ఆయన రియాక్షన్స్ చూడలేకపోయా. అప్పటికే తను నాతో ప్రేమలో ఉన్నారు. సో.. దాదాపు మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నాం’’ అని నమత్ర చెప్పింది. 2005, ఫిబ్రవరి 10న మహేశ్-నమ్రత ముంబైలో వివాహం చేసుకున్నారు.

Tollywood
Mahesh Babu
namrata
marriage 14 th anniversary
shy
interview
  • Loading...

More Telugu News