Andhra Pradesh: ఈ వీడియో చూడండి.. ప్రధాని మోదీ మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసం ఫ్రీగా ప్రచారం చేస్తున్నారు!: రామ్ గోపాల్ వర్మ

  • లక్ష్మీస్ ఎన్టీఆర్ ను తెరకెక్కిస్తున్న వర్మ
  • ఈ నెల 14న ట్రైలర్ విడుదలకు సన్నాహాలు
  • మోదీ ప్రచారంపై ట్విట్టర్ లో వీడియో విడుదల

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ రాజకీయ, వ్యక్తిగత జీవితం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను  ప్రేమికుల దినోత్సవం(ఫిబ్రవరి 14న) రోజున ఉదయం 9.27 గంటలకు విడుదల చేస్తానని వర్మ ప్రకటించారు. ఈరోజు ప్రధాని మోదీ గుంటూరు సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంపై వర్మ స్పందించారు.

ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఈ వీడియోను 21.44 నిమిషాల నుంచి చూడండి. ప్రధాని మోదీ స్వయంగా మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు ప్రచారం చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. దీనికి ఓ తెలుగు వార్తా ఛానల్ ప్రసారం చేసిన వీడియోను జతచేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News