Tollywood: ఈ లెజెండ్ గురించి ఎవరు ఎంత చెప్పినా తక్కువే.. మమ్ముట్టిపై అనసూయ ప్రశంసల వర్షం!

  • సుచరితారెడ్డి పాత్ర నా మనసులో ఎన్నటికీ ఉండిపోతుంది
  • నన్ను నమ్మినందుకు దర్శకుడు రాఘవ్ కు కృతజ్ఞతలు
  • ట్విట్టర్ లో స్పందించిన అనసూయ భరద్వాజ్

వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమాను దర్శకుడు మహి.వి.రాఘవ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గౌరు సుచరితారెడ్డి పాత్రలో అనసూయ నటించింది. యాత్ర సినిమాలో తన పాత్రను అభినందిస్తూ సందేశాలు పంపుతున్న అభిమానులకు అనసూయ కృతజ్ఞతలు తెలిపింది.

ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘యాత్రలో నేను పోషించిన సుచరితారెడ్డి పాత్ర నా మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. ఈ పాత్ర నేను చేయగలనని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మహి.వి.రాఘవ్ సార్ కు, 70mmEntertainsకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేసింది.
అనంతరం ఈ సినిమాలో వైఎస్ పాత్ర పోషించిన మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి మాట్లాడుతూ..‘ఈ లెజెండ్ గురించి ఎవరు ఎంత మాట్లాడినా తక్కువే. మమ్ముట్టి సార్.. వైఎస్ గారి పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాతో మమ్ముట్టి సార్ వైఎస్ గారు బతికున్నప్పటి రోజులను గుర్తుచేశారు. ఇకపై యాత్ర చూసిన ప్రతీసారి అప్పటి రోజులు గుర్తుకు వస్తాయి’ అని వ్యాఖ్యానించింది. గత శుక్రవారం విడుదలైన యాత్ర సినిమా థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది.

Tollywood
movie
yatra
mammutti
ysr
sucharita reddy
Twitter
anasuya
praise
  • Loading...

More Telugu News