ramdev baba: పూర్తి అవగాహనతోనే మా పూర్వీకులు ఇస్లాంను స్వీకరించారు: అసదుద్దీన్ ఒవైసీ

  • ఇస్లాం తీసుకోవడంలో ఎవరి ఒత్తిడి లేదు
  • రాందేవ్ ఆయన నమ్మకాలను ఆయన వద్దే ఉంచుకోవాలి
  • ఇతరులపై బలవంతంగా రుద్దాలనుకోవడం సరికాదు

రాముడు కేవలం హిందువులకే కాకుండా ముస్లింలకు కూడా పూర్వీకుడేనని యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల్లోకి ఎలాంటి సందేశాన్ని పంపాలని కోరుకుంటున్నారని ప్రశ్నించారు. తమ పూర్వీకుల ఇష్టంతోనే తాము భారత్ లో ముస్లింలుగా ఉన్నామని... ఇస్లాం తీసుకోవడంలో ఎవరి ఒత్తిడి లేదని ఆయన అన్నారు. పూర్తి అవగాహనతోనే తమ పూర్వీకులు ఇస్లాంను స్వీకరించారని తెలిపారు. ఆయన (రాందేవ్) నమ్మకాలను ఆయన వద్దే ఉంచుకోవాలని చెప్పాలనుకుంటున్నానని... ఇతరులపై మీ నమ్మకాలను బలవంతంగా రుద్దాలనుకోవడం సరికాదని అన్నారు.

ramdev baba
islam
ram
asaduddin owaisi
  • Loading...

More Telugu News