Andhra Pradesh: ‘యాత్ర’లో ఏమైనా తేడా జరిగి ఉంటే జగన్ ఫ్యామిలీకి తీవ్ర నష్టం జరిగేది!: మహి.వి.రాఘవ్

  • శుక్రవారం విడుదలైన యాత్ర సినిమా
  • జగన్, వైఎస్ కుటుంబానికి రాఘవ్ ధన్యవాదాలు
  • తనను నమ్మి వైఎస్ చరిత్రను చెప్పారని వ్యాఖ్య

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా మహి.వి.రాఘవ్ ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా పలు థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు మహి.వి.రాఘవ్ వైఎస్ కుమారుడు జగన్, ఆయన కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈరోజు రాఘవ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘నాపై నమ్మకం ఉంచి, గుడ్డిగా నమ్మి రాజశేఖరరెడ్డి గారి జీవిత చరిత్రను చెప్పిన వైఎస్ జగన్ అన్నకు, ఆయన కుటుంబానికి రుణపడి ఉంటాను. ‘యాత్ర’ సినిమాలో ఏదైనా తేడా జరిగిఉంటే వాళ్లు(జగన్ కుటుంబం)చాలా నష్టపోయేవారు. ఫలితం ఎలా ఉన్నా నాకు లాభం తప్ప నష్టముండేది కాదు. అయినా నన్ను అంతగా నమ్మి ఎందుకు రిస్క్ తీసుకున్నారంటే చెప్పడం కష్టమే’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Tollywood
YATRA
Mahi v raghav
movie
Twitter
thanked
greatfull
  • Loading...

More Telugu News