Andhra Pradesh: 14వ వివాహ వార్షికోత్సవం.. ట్విట్టర్ లో రొమాంటిక్ గా స్పందించిన మహేశ్ బాబు!

- 2005, ఫిబ్రవరి 10న మహేశ్-నమ్రత వివాహం
- నమ్రతకు వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రిన్స్
- మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా మహేశ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల వివాహం జరిగి నేటికి సరిగ్గా 14 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రిన్స్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘అనుకోకుండా ఈ ఫొటోను తీశారు. అప్పుడే పెళ్లయి 14 ఏళ్లు అయిపోయాయి. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మై లవ్’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు నమ్రతతో కలిసి దిగిన ఓ ఫొటోను జతచేశారు. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు మహేశ్-నమ్రత దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
