Andhra Pradesh: నా సోల్ మేట్.. నా సర్వస్వం.. అనీల్ కుమార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు!: వైఎస్ షర్మిల

- అనీల్ నాకు దేవుడిచ్చిన వరం
- తల్లి,తండ్రి, అన్నలా ప్రేమించే భర్త దొరికాడు
- ట్విట్టర్ లో స్పందించిన జగన్ సోదరి
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బావ అనీల్ కుమార్ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనీల్ తనకు దేవుడిచ్చిన వరమని షర్మిల వ్యాఖ్యానించారు. తండ్రిలా ఆలనాపాలనా చూసి, తల్లిలా ప్రేమించి, అన్నలా కోరిన కోరికలన్నీ తీర్చే భర్త తనకు దొరికాడని సంతోషం వ్యక్తం చేశారు.
