Jagan: మహీ, శశీ, విజయ్... కంగ్రాచ్యులేషన్స్: వైఎస్ జగన్

  • రెండు రోజుల క్రితం విడుదలైన 'యాత్ర'
  • హిట్ టాక్ ను తెచ్చుకున్న చిత్రం
  • చిత్ర యూనిట్ కు జగన్ అభినందనలు

రెండు రోజుల క్రితం విడుదలై, మంచి టాక్ ను తెచ్చుకున్న దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర' టీమ్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. "మహానేత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని సినిమాగా తెరకెక్కించటంలో మీరు చూపించిన అభిరుచి, అకింతభావానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.

అలాగే, దర్శకుడు మహి వీ రాఘవతో పాటు నిర్మాతలు, 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌ టెయిన్ మెంట్స్ బ్యానర్‌ పై సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి, శివలను అభినందించారు. ఈ చిత్రంలో వైఎస్ పాత్రను మమ్ముట్టి అద్భుతంగా పోషించారన్న ప్రశంసలు వస్తున్నాయి.



Jagan
Yatra
Mahi V Raghava
Sasi Devireddy
70 MM
  • Loading...

More Telugu News