Karnataka: ఆ వీడియో క్లిప్ నకిలీదని తేలితే రాజీనామా: కర్ణాటక సీఎం కుమారస్వామి

  • యడ్యూరప్ప ‘ఆఫర్’ ఆడియో క్లిప్ విడుదల
  • అది నకిలీదన్న బీజేపీ కర్ణాటక చీఫ్
  • అదే నిజమైతే రాజీనామాకు సిద్ధమన్న కుమారస్వామి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పపై తాను విడుదల చేసిన ఆడియో క్లిప్ నకిలీదని తేలితే రాజీనామా చేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ  కుమారస్వామి సవాలు విసిరారు. ‘ఆపరేషన్ కమల’లో భాగంగా జేడీఎస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించిన కుమారస్వామి.. బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప-శరణకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలకు యడ్యూరప్ప ‘ఆఫర్’ చేస్తున్నట్టు ఆ క్లిప్‌లో స్పష్టంగా వినబడుతోంది. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కుమారస్వామి ఈ టేప్‌ను విడుదల చేశారు.

ఈ ఆడియో క్లిప్‌పై స్పందించిన యడ్యూరప్ప అది ‘ఫేక్’ అంటూ కొట్టిపడేశారు. దీంతో స్పందించిన కుమారస్వామి ఆ ఆడియో క్లిప్ నకిలీదని తేలితే సీఎం పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.

కాగా, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అంతకుముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక్కో ఎమ్మెల్యేకు యడ్యూరప్ప పది కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, 12 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, మరో ఆరుగురికి వివిధ బోర్డులలో చైర్మన్ పదవులు ఇస్తానని ఆశ పెడుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News