Hardik pandya: మైదానంలో పాండ్యాను ఆటపట్టిస్తూ ప్లకార్డ్ ప్రదర్శించిన యువతి

  • కాఫీ విత్ కరణ్ షోలో పాండ్యా అనుచిత వ్యాఖ్యలు
  • వాటిని గుర్తుకు తెచ్చేలా ప్లకార్డు ప్రదర్శించిన యువతి
  • సోషల్ మీడియాలో వైరల్

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మైదానంలోనే ట్రోల్ చేసిందో అమ్మాయి. ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిషేధానికి గురైన పాండ్యా ఇటీవలే తిరిగి జట్టులోకి వచ్చాడు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి విమర్శలు కొనితెచ్చుకున్న పాండ్యా ఆ తర్వాత క్షమాపణలు చెప్పినప్పటికీ నెటిజన్లు మాత్రం అతడి వ్యాఖ్యలను మర్చిపోలేకపోతున్నారు.  

శుక్రవారం భారత్-న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్‌లో జరిగిన రెండో వన్డేలో హార్దిక్ పాండ్యా మైదానంలో కనిపించిన వేళ ఓ అమ్మాయి చూపించిన ప్లకార్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘కాఫీ విత్ కరణ్’ షోలో పాండ్యా మాట్లాడుతూ ‘నేను ఈ రోజు చేసే వచ్చాను’ (మై కర్‌కే ఆయా) వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చేలా ‘పాండ్యా ఆజ్ కర్‌కే ఆయా క్యా’ (పాండ్యా.. ఈ రోజు కూడా చేసే వచ్చావా?) అని ప్లకార్డు ప్రదర్శించింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ప్లకార్డుపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 

Hardik pandya
Woman
troll
controversy
Koffee with Karan
  • Loading...

More Telugu News