Bollywood actor: అత్యంత దయనీయ స్థితిలో మృతి చెందిన ‘నంబర్ వన్’ విలన్ మహేశ్ ఆనంద్.. ఆర్థిక ఇబ్బందులే కారణమా?

  • కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • కృష్ణ, బాలకృష్ణ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రతో గుర్తింపు
  • 18 ఏళ్ల తర్వాత గత నెలలో తెరపై కనిపించిన మహేశ్ ఆనంద్

బాలీవుడ్ ప్రముఖ నటుడు, తెలుగులో ‘నంబర్ వన్’, ‘టాప్ హీరో’ వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న మహేశ్ ఆనంద్ మృతి చెందాడు. 57 ఏళ్ల మహేశ్ ఆనంద్ అత్యంత దయనీయ స్థితిలో కన్నుమూశాడు. ముంబైలోని అంధేరీలో ఉన్న ఆయన నివాసం నుంచి పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉన్న ఆయన మృతదేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతదేహం లభ్యమైన స్థితిని బట్టి ఆయన చనిపోయి కనీసం రెండు రోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  అయితే, ఆర్థిక ఇబ్బందులు ఆయన మృతికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇటీవల ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ ఆనంద్ మాట్లాడుతూ.. 18 ఏళ్ల తర్వాత నటుడు గోవింద సినిమా ‘రంగీలా రాజా’లో అవకాశం వచ్చినట్టు తెలిపారు. గత నెల 18న ఈ సినిమా విడుదలైంది. తాను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, ఆర్థికంగా చితికిపోయానని పేర్కొన్నారు. మహేశ్ భార్య మాస్కోలో  ఉంటుండగా, ఆయన ముంబైలో ఒంటరిగా ఉన్నట్టు తెలుస్తోంది.

Bollywood actor
Mahesh Anand
Mumbai
negative roles
Rangeela Raja
  • Loading...

More Telugu News