lok satta: పవన్ కల్యాణ్ చిత్తశుద్ధి గల మనిషి: జయప్రకాష్ నారాయణ

  • వ్యక్తులు, పార్టీల గురించి నేను వ్యాఖ్యలు చేయను
  • పవన్ కల్యాణ్ నాకు మంచి మిత్రుడు
  • మంచి కోసం ఎవరు ముందుకొచ్చినా మద్దతివ్వాలి

వ్యక్తుల గురించి, పార్టీల గురించి తాను వ్యాఖ్యలు చేయనని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ (జేపీ) అన్నారు. ‘జనసేన పార్టీ  అధినేత పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లిన తీరుపై మీ అభిప్రాయం ఏంటి?’ అనే ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని, చిత్తశుద్ధి గల మనిషి అని అన్నారు. ఆయనలో చిత్తశుద్ధి ఉందన్న విషయాన్ని ఏ వర్గం వారైనా విశ్వసిస్తారని అన్నారు. సమాజంలో మంచి జరగాలని కోరుకుంటున్న వాళ్లు చాలామంది ఉన్నారని, ఆ మంచి కోసం ఎవరు ముందుకొచ్చినా, పార్టీలతో ప్రమేయం లేకుండా మనం మద్దతివ్వాలని అన్నారు. అన్ని పార్టీల్లో మంచీచెడూ ఉన్నాయని, అంతేతప్ప, పార్టీల అంతర్గత వ్యవహారాల గురించి తాను మాట్లాడదలచుకోలేదని జేపీ స్పష్టం చేశారు.

lok satta
jp
jana sena
Pawan Kalyan
  • Loading...

More Telugu News