Narendra Modi: మోదీ రాకను నిరసిస్తూ మట్టి-నీరు కుండలను పగలగొట్టిన బుద్ధా వెంకన్న!

  • ఏపీకి మోదీ ఏదైనా చేస్తానంటే అది చెల్లని చెక్కే
  • వైసీపీ తప్ప అన్ని పార్టీలు మోదీని ప్రశ్నిస్తున్నాయి
  • జీవీఎల్ కి హోదా ఉంటే చాలా? ఏపీకి అవసరం లేదా?

రేపు ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనుండటంపై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని పట్టించుకోని మోదీ రాకపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. మోదీ రాకను నిరసిస్తూ మట్టి-నీరు కుండలను పగలగొట్టారు.

ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీకి మోదీ ఏదైనా చేస్తానంటే అది చెల్లని చెక్కుతో సమానమేనని విమర్శించారు. వైసీపీ తప్ప అన్ని పార్టీలు మోదీని ప్రశ్నిస్తున్నాయని, మోదీ సభకు వైసీపీ కార్యకర్తలను తరలించే పనిలో జగన్ ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రానికి మోదీ వస్తుంటే నిరసన తెలిపే ధైర్యం వైసీపీకి లేదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపైనా ఆయన మండిపడ్డారు. జీవీఎల్ కి హోదా ఉంటే చాలా? ఏపీకి ప్రత్యేకహోదా అవసరం లేదా? అని ప్రశ్నించారు.

Narendra Modi
Prime Minister
Telugudesam
buddha venkanna
  • Loading...

More Telugu News