Narendra Modi: అమిత్‌షాకు పట్టిన గతే.. మోదీకీ పడుతుంది: జేసీ దివాకర్‌రెడ్డి

  • కార్పోరేటర్‌గా పోటీ చేస్తా
  • రోడ్ల విస్తరణ జరిగి తీరుతుంది
  • పొత్తులున్నా.. లేకున్నా మళ్లీ చంద్రబాబే సీఎం

సీఎం చంద్రబాబు తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని.. పొత్తులున్నా.. లేకున్నా మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావడం ఖాయమని  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా పలాసలో అమిత్‌షాకు పట్టిన గతే.. గుంటూరులో ప్రధాని మోదీకి పడుతుందని తెలిపారు. ఈ సారి తాను అనంతపురం నుంచి కార్పోరేటర్‌గా పోటీ చేస్తానని తెలిపారు.

ఈ నెల 15న అనంతపురంలోని పాతూరులో రోడ్ల విస్తరణ జరిగి తీరుతుందని.. దీనికోసం ప్రభుత్వం రూ.100 కోట్లు ఇవ్వగా.. ఎంపీ నిధుల నుంచి తాను రూ.10 కోట్లు ఇచ్చానని స్పష్టం చేశారు. రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసిన తరువాతే పనులు మొదలు పెడతామని జేసీ తెలిపారు.  

Narendra Modi
Amith Shah
Chandrababu
JC Diwakar Reddy
Guntur
Ananthapuram
  • Loading...

More Telugu News