Sai Pallavi: పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా: సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్

  • నా తల్లిదండ్రులతోనే ఉండాలని ఉంది
  • జాగ్రత్తగా చూసుకోవాలని ఉంది
  • పెళ్లైతే నేననుకున్నట్టు చూసుకోలేను

‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సాయి పల్లవి చాలా దగ్గరైంది. ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసింది. ఈ చిత్రంలో సాయి పల్లవి నక్సలైట్‌గా నటిస్తోందని టాక్. అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

జీవితంలో తాను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు సాయి పల్లవి స్పష్టం చేసింది. ‘పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. నాకు నా తల్లిదండ్రులతోనే ఉండాలని ఉంది. వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఉంది. పెళ్లి చేసుకుంటే నా తల్లిదండ్రుల బాగోగులు నేననుకున్నట్టుగా చూసుకోలేను. అందుకే జీవితంలో వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నా’ అని తెలిపింది. దీంతో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది.    

Sai Pallavi
Fida
Venu Udugula
Marriage
Shocking Comments
  • Loading...

More Telugu News