Jagan: అప్పుడు నీళ్లు, మట్టి ఇచ్చారు.. ఇప్పుడు ఏమిస్తారు?: మంత్రి అమరనాథ్ రెడ్డి

  • చంద్రబాబుపై కోపాన్ని రాష్ట్రంపై చూపిస్తున్నారు
  • రాజధాని నిర్మాణం మాత్రం ఆగదు
  • చంద్రబాబు భిక్షతోనే పులివెందులకు నీళ్లు

ప్రధాని మోదీ అప్పుడు నీళ్లు, మట్టి ఇచ్చారు.. ఇప్పుడు ఏమిస్తారని.. అసలు ఏ ముఖం పెట్టుకుని ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారని మంత్రి అమరనాథ్‌రెడ్డి మండిపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై ఉన్న కోపాన్ని మోదీ రాష్ట్రంపై చూపిస్తున్నారని.. ఎవరేం చేసినా రాజధాని నిర్మాణం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. మోదీ గురించి మాట్లాడే దమ్ము జగన్‌కు లేదని విమర్శించారు.

జగన్ తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని అమర్‌నాథ్ రెడ్డి జోస్యం చెప్పారు. చేసేది అవినీతి అయినా జగన్ మాటలు మాత్రం టాటా, బిర్లాల కుటుంబం నుంచి వచ్చినట్టుంటాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు భిక్షతోనే పులివెందులకు నీళ్లొచ్చాయని.. వైఎస్ కుటుంబం ఏమీ చేయలేదని పేర్కొన్నారు. జగన్ పగటి కలలు కంటున్నారని.. చంద్రబాబును, ఆయన పథకాలను కాపీ కొట్టాలంటే జగన్‌కు 50 ఏళ్లు కూడా సరిపోవని అమర్‌నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Jagan
Chandrababu
Narendra Modi
Amaranath Reddy
Pulivendula
  • Loading...

More Telugu News