Anushka Sharma: మా న్యాయమైన కోర్కెలు నెరవేర్చాకే మా గడ్డపై అడుగుపెట్టండి: మోదీని హెచ్చరించిన చంద్రబాబు

  • మోదీ రేపు గుంటూరొస్తున్నాడు
  • మళ్లీ నన్ను గట్టిగా తిడతాడు!
  • వైసీపీ అవినీతి ట్రాప్ లో పడింది మోదీయే

తమ న్యాయమైన కోర్కెలు నెరవేర్చాకే తమ గడ్డపై ప్రధాని మోదీ అడుగుపెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. నెల్లూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, తమ న్యాయమైన కోర్కెలు నెరవేర్చకుండా ఈ గడ్డపై తమను తిట్టేందుకు ఇక్కడికొస్తే ఉపేక్షించమని, ఈ విషయాన్ని మోదీకి అర్థమయ్యేలా ప్రజలు తమ నిరసనల ద్వారా చెప్పాలని పిలుపు నిచ్చారు. ‘రేపు వస్తున్నాడు గుంటూరుకు. మళ్లీ నన్ను గట్టిగా తిడతాడు. నేనేదో వైసీపీ ట్రాప్ లో పడిపోయానని మోదీ చెప్పాడు. నేను పడలా.. అవినీతి ట్రాప్ లో మీరు పడిపోయారు. వైసీపీ అవినీతి ట్రాప్ లో మీరు పడ్డారు తప్ప..నేను కాదు. కేసీఆర్ కు నాకంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉందని మోదీ అన్నాడు. కేసీఆర్ నా దగ్గర ఉండే పైకొచ్చాడు. ఆయన అదృష్టం కలిసొచ్చింది. ఇప్పుడు నన్నే ఎన్ని విమర్శించాలో అన్ని విమర్శిస్తున్నారు’ అని అన్నారు.

Anushka Sharma
nellore
cm
Chandrababu
  • Loading...

More Telugu News