Andhra Pradesh: నెల్లూరులో చంద్రబాబు టూర్.. పార్కులో హుషారుగా ముఖ్యమంత్రి ఎక్సర్ సైజ్.. వీడియో వైరల్!

  • 4 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు అందజేత
  • కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
  • సీఎం వెంట మంత్రి నారాయణ, మేయర్ అజీజ్

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లు లేని నిరుపేదలకు చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు 4 లక్షల గృహాలను అందించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద నిర్మించిన ఈ ఇళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు ఈరోజు అందించారు. నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర కాలనీని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు లబ్ధిదారులతో ముచ్చటించారు.

గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మించిన ఈ ఇళ్లను పరిశీలించిన అనంతరం అక్కడే పార్కులో ఏర్పాటు చేసిన పలు వ్యాయామ పరికరాలతో ఎక్సర్ సైజ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట జిల్లా మంత్రి నారాయణ, మేయర్ అజీజ్ తదితరులు ఉన్నారు. చంద్రబాబు హుషారుగా ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Andhra Pradesh
Nellore District
Chandrababu
Telugudesam
excercise
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News