Andhra Pradesh: ఎప్పుడు ఏం చేయాలో సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు!: జేసీ దివాకర్ రెడ్డి

  • ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ లకు స్థానం లేదు
  • మోదీ సభ ఎలా ఉండబోతోందో తెలిసిపోయింది
  • బీజేపీపై సెటైర్లు వేసిన టీడీపీ నేత

ప్రధాని నరేంద్ర మోదీ రేపు గుంటూరులో జరిగే ప్రజా చైతన్య సభలో పాల్గొననున్న సంగతి తెలిసిందే. అయితే మోదీ పర్యటనను అడ్డుకోవడానికి టీడీపీ, వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, అనంతపురం లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ చీఫ్ అమిత్ షా పర్యటన అనంతరం ఆ పార్టీ స్థాయి ఏంటో తెలిసిపోయిందని దివాకర్ రెడ్డి సెటైర్ వేశారు. ఇక ప్రధాని మోదీ సభ ఎలా ఉండబోతోందో అందరికీ తెలుసని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్థానం లేదని దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు అంటూ ఉండరని మళ్లీ అంతలోనే ట్విస్ట్ ఇచ్చారు. ఏపీలో ఎప్పుడు ఏం చేయాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా తెలుసని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
jc diwakar reddy
Anantapur District
BJP
criticise
  • Loading...

More Telugu News