Andhra Pradesh: సీఎం చంద్రబాబుకు కులగజ్జి పట్టుకుంది.. సర్వేల పేరుతో బరితెగించారు!: వైసీపీ నేతలు కోన రఘుపతి, మల్లాది విష్ణు

  • లక్షలాది వైసీపీ ఓట్లను తొలగించారు
  • అధికారంలోకి రావాలని అక్రమాలు 
  • తిరుపతిలో మీడియాతో వైసీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కులగజ్జి పట్టుకుందని వైసీపీ నేతలు కోన రఘుపతి, మల్లాది విష్ణు విమర్శించారు. సర్వేల పేరుతో టీడీపీ నేతలు ఏపీలో బరితెగించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రఘుపతి, విష్ణు మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించడంతో పాటు సొంత సామాజికవర్గానికి చెందిన పోలీస్ అధికారులను కీలక స్థానాల్లో నియమించారని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న అత్యాశతోనే చంద్రబాబు ఈ అక్రమాలకు తెరలేపారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
malladi vishnu
kona raghupati
  • Loading...

More Telugu News