Narendra Modi: మోదీ సభకు బస్సులు ఇవ్వవద్దని ఆర్డీవోలు ఓనర్లను బెదిరిస్తున్నారు!: కన్నా లక్ష్మీనారాయణ

  • సభను అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు
  • బస్సులు ఇవ్వకుండా అధికారులతో వేధింపులు
  • గుంటూరులో మీడియా సమావేశంలో బీజేపీ నేత

ప్రధాని మోదీ గుంటూరు పర్యటనను అడ్డుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మోదీ ‘ప్రజా చైతన్య సభ’కు బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను తరలించడానికి బస్సులు ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నా మాట్లాడారు.

బీజేపీ సభకు బస్సులు ఇవ్వవద్దని యజమానులను ప్రభుత్వ పెద్దలు ఆర్డీవో అధికారుల ద్వారా బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం దిగజారిన ముఖ్యమంత్రి ఏపీలో ఉన్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గుంటూరులో రేపు నిర్వహించనున్న ప్రజాచైతన్య సభను భగ్నం చేయాలని చంద్రబాబు టీడీపీ గూండాలకు పిలుపునిచ్చారని ఆరోపించారు.

Narendra Modi
BJP
Guntur District
Chandrababu
busus
warning
owners
rdos
blackmail
kanna lakshmi narayana
  • Loading...

More Telugu News