Andhra Pradesh: నాని అన్నా.. ‘యాత్ర’ సినిమా చూసినందుకు చాలా థ్యాంక్స్!: మహి.వి.రాఘవ్

  • యాత్ర సినిమా చూసిన గుడివాడ ఎమ్మెల్యే
  • చిత్ర యూనిట్ ను ప్రశంసిస్తూ ట్వీట్
  • చాలా సంతోషంగా ఉందన్న దర్శకుడు రాఘవ్

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమాను మహి.వి.రాఘవ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను చూసిన గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని దర్శకుడితో పాటు సినిమా యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. యాత్ర సినిమా అందరి గుండెల్ని తాకిందని కితాబిచ్చారు. తెరపై మమ్ముట్టిని చూస్తున్నంతసేపు వైఎస్ మాత్రమే కనిపించారని అన్నారు.

ఈ మేరకు నాని ట్వీట్ చేశారు. దీంతో దర్శకుడు మహి.వి.రాఘవ్ ఈ విషయమై ట్విట్టర్ లో స్పందిస్తూ..‘కొడాలి నాని అన్నా.. సినిమా చూసినందుకు చాలా థ్యాంక్స్. నీకు సినిమా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు. నిన్న ‘యాత్ర’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

Andhra Pradesh
YSRCP
gudiwada mla
Kodali Nani
yatra
Tollywood
Twitter
  • Loading...

More Telugu News