Andhra Pradesh: ప్లీజ్.. నా వాట్సాప్ సేవలను పునరుద్ధరించండి.. కంపెనీకి సీఎం రమేశ్ విజ్ఞప్తి!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-6cb4a07081ddf1ce9f6419f429385e4c7f7ad47b.jpg)
- వాట్సాప్ సేవలను నిలిపివేసిన కంపెనీ
- నిబంధనలు ఉల్లంఘించారని వ్యాఖ్య
- మరోసారి జాగ్రత్తగా ఉంటానన్న టీడీపీ నేత
తన ఫోన్ నంబర్ కు వాట్సాప్ సేవలను నిలిపివేయడంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ స్పందించారు. తాను నిబంధనల ప్రకారమే వ్యవహరించానని తెలిపారు. పొరపాటున తప్పు జరిగి ఉంటే మరోసారి అలా కాకుండా జాగ్రత్త పడతానని అన్నారు.
ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా తన నంబర్ కు వాట్సాప్ సేవలను పునరుద్ధరించాలని కంపెనీని కోరారు. కార్యకర్తలు, నేతలతో సంప్రదింపులు జరిపేందుకు తనకు వాట్సాప్ అవసరమని వ్యాఖ్యానించారు.
తమ కంపెనీ నియమనిబంధనలు ఉల్లంఘించడంతో పాటు చాలా ఫిర్యాదులు రావడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ సీఎం రమేశ్ కు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీఎం రమేశ్ పై ఎవరు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని వాట్సాప్ సంస్థ గోప్యంగా ఉంచింది.