Narendra Modi: ఐదేళ్ల క్రితం మోదీ ఇలా నిలబడి మాట్లాడేవారు.. సభలో రాహుల్ మిమిక్రీ.. నవ్వులు

  • లోక్‌సభలో కాంగ్రెస్ నేతలను అనుకరించిన మోదీ
  • భోపాల్‌లో మోదీని అనుకరించి నవ్వులు పూయించిన రాహుల్
  • రైతులకు రూ. 17 ఇచ్చినందుకు బీజేపీ నేతలు ఆనందంతో బల్లలు చరిచారని ఎద్దేవా

లోక్‌సభలో బడ్జెట్‌పై మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ నేతలు ఎలా మాట్లాడతారో మిమిక్రీ చేసి చూపించారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని హావభావాలను అనుకరించి నవ్వులు పూయించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం మోదీ నిలబడి మాట్లాడేవారని, 56 అంగుళాల చాతీ ఉన్న తాను దేశానికి కాపలాదారుడిగా ఉంటానని అన్నారని, అవినీతిని అంతం చేస్తానని చెప్పుకొచ్చారంటూ మోదీని అనుకరించారు.

ఆ తర్వాత రాహుల్ మళ్లీ మాట్లాడుతూ.. ఇప్పుడు మోదీ ఇలా ముఖం కిందికి పెట్టుకుని మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌ను అంతం చేస్తానంటున్నారని అనుకరించి చూపించడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ నేతలు ఐదు నిమిషాలపాటు ఆపకుండా బల్లలు చరిచారని, వారు అంతగా ఎందుకు బల్లలు చరుస్తూ చప్పట్లు కొట్టారో ఆరా తీస్తే.. రైతులకు రూ. 17 ఇచ్చినందుకే వారంతా అలా చప్పట్లు కొట్టారని తేలిందని రాహుల్ ఎద్దేవా చేశారు.

Narendra Modi
Rahul Gandhi
BJP
Congress
mimicry
Madhya Pradesh
  • Loading...

More Telugu News