Ram mandiram: రామ మందిరాన్ని అయోధ్యలో కాకుండా మక్కా మదీనాలోనో, వాటికన్ లోనో నిర్మించలేరుగా?: బాబా రాందేవ్

  • రాముడి జన్మస్థలం అయోధ్య
  • హిందువులకే కాదు ముస్లింలకూ ఆయన పూర్వీకుడు
  • ఈ అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టొద్దు 

రామ మందిరం నిర్మాణాన్ని అయోధ్యలో కాకుండా, మక్కా, మదీనాలోనో లేకపోతే వాటికన్ సిటీలోనో నిర్మించ లేరుగా అని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ప్రశ్నించారు. గుజరాత్, ఖేదా జిల్లాలోని నదియాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాముడు మన పూర్వీకుడని, కేవలం, హిందువులకే కాదు ముస్లింలకు కూడా ఆయన పూర్వీకుడని వ్యాఖ్యానించారు. రాముడి జన్మస్థలం అయోధ్య అనేది వాస్తవమని, ఇక్కడ రామమందిర నిర్మాణం జాతికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. రామమందిర నిర్మాణం అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టొద్దని ఈ సందర్భంగా బాబా రాందేవ్ సూచించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.  

Ram mandiram
ayodhya
macca madina
vatikan
  • Loading...

More Telugu News