Dwivedi: ఏపీ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బంది కలగకుండా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం!

  • కొత్తగా 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి
  • టీటీడీ దర్శనం తరహాలో ఓటర్లకు టోకెన్లు
  • బోగస్ ఓటర్ లిస్టుపై 15 రోజుల్లో తనిఖీ

వచ్చే ఏపీ ఎన్నికల్లో వినూత్న కార్యక్రమానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టనుంది. నేడు అమరావతిలో పలు రాజకీయ పార్టీల నేతలతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు పడకుండా టీటీడీ దర్శనం తరహాలో ఓటర్లకు టోకెన్లు ఇస్తామని ద్వివేది తెలిపారు.

గత నెలలో ప్రకటించిన ఓటర్ల జాబితాకి 3.69 మంది కొత్త ఓటర్లు జతయ్యారని వెల్లడించారు. కొత్తగా 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని ద్వివేది తెలిపారు. బోగస్ ఓటర్ లిస్టుపై 15 రోజుల్లో తనిఖీ పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని తెలిపారు. జిల్లాల్లో ఈవీఎంల మొదటి దశ తనిఖీలు జరుగుతాయని.. ఈ తనిఖీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పక పాల్గొనాలని ఆయన కోరారు.

Dwivedi
AP Elections
TTD
Tokens
Polling Stations
EVM
  • Loading...

More Telugu News