Nellore District: నెల్లూరు రూరల్ నుంచి చంద్రబాబు నన్ను పోటీ చేయమన్నారు: ఆదాల ప్రభాకర్ రెడ్డి

  • నెల్లూరు రూరల్ లో టీడీపీ జెండా ఎగరడం ఖాయం
  • వైసీసీ వాళ్లు రకరకాల వదంతులు సృష్టిస్తున్నారు
  • వైసీపీ వ్యాఖ్యలు హాస్యాస్పదం

ఏపీలోని నెల్లూరు జిల్లాలో మూడు టీడీపీ సీట్లు ఖరారయ్యాయి. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ నుంచి నారాయణ, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు టీడీపీలో సందడి నెలకొంది.

 ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు రూరల్ లో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నీ ఆలోచించారని, నిన్న తనను పిలిచి ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఆయన అడిగిన విషయాన్ని ప్రస్తావించారు. దీంతో, తాను సంతోషపడ్డానని, ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పానని అన్నారు. తమకు మంచి నాయకత్వం ఉందని, వాళ్లందరినీ సమన్వయం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. ఎంపీగా పోటీ చేద్దామని తాను అనుకున్నానని, అయితే, ఎమ్మెల్యేగా పోటీ చేయమంటారని అనుకోలేదని అన్నారు. వైసీసీ వాళ్లు రకరకాల వదంతులు సృష్టిస్తున్నారని, వాళ్లను చూసి టీడీపీ వాళ్లు పారిపోతున్నారన్న వైసీపీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు.

Nellore District
Chandrababu
aadala
prabhaker reddy
narayana
somireddy
  • Loading...

More Telugu News