Kodela Siva Prasadarao: స్పీకర్‌గా అవకాశం రావడం గొప్ప విషయం.. అది ఉగాది పచ్చడిలాంటిది: కోడెల

  • నేటితో 32వ అసెంబ్లీ సమావేశాలు పూర్తి
  • సభ జరిగిన తీరుపై ప్రశంసలొచ్చాయి
  • సభ్యులంతా గెలిచి మళ్లీ సభకు రావాలి
  • చంద్రబాబు సీఎంగా తిరిగి రావాలి

నేటితో ఏపీ 32వ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సుదీర్ఘంగా ప్రసంగించారు. శాసనసభ స్పీకర్‌గా తనకు అవకాశం రావడం గొప్ప విషయమని.. అది ఉగాది పచ్చడిలాంటి ఉద్యోగమని కోడెల పేర్కొన్నారు. తనను స్పీకర్‌గా ఎన్నుకోవడంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

సభ్యులంతా గెలిచి మళ్లీ సభకు రావాలని.. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా రావాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య తనను ఎంతగానో బాధించిందని కోడెల తెలిపారు. ఈసారి మహిళా పార్లమెంట్ వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించామని కోడెల ఆనందం వ్యక్తం చేశారు.

Kodela Siva Prasadarao
Ugadi
Assembly Speaker
Kidari Sarveswara Rao
Women Parliament
Chandrababu
  • Loading...

More Telugu News