AK Anthony: రక్షణ శాఖ ఒప్పందాలపై ప్రధాని కార్యాలయానికి ఆసక్తి ఎందుకు?: ఏకే ఆంథోని

  • పీఎంవో ఏదో దాస్తోంది
  • ఎవరి ప్రయోజనాలను కాపాడదలుచుకుంది?
  • అన్నిటికీ ప్రధాని సమాధానం చెప్పాలి 

రక్షణ ఒప్పందాల బాధ్యత రక్షణ మంత్రిత్వ శాఖదేనని, దానిపై ప్రధాని కార్యాలయం ఎందుకు ఆసక్తి చూపుతోందని, ఎవరి ప్రయోజనాలను కాపాడదలుచుకుందని మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంథోని ప్రశ్నించారు. వీటన్నిటికీ ప్రధాని సమాధానమివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

రక్షణ శాఖ అభ్యంతరాలను పక్కనబెట్టి రాఫెల్ ఒప్పందంపై ప్రధాని కార్యాలయం నేరుగా ఫ్రాన్స్‌తో చర్చలు జరిపిందన్న వార్తలపై ఆంథోని స్పందించారు. ఈ విషయంలో పీఎంవో ఏదో దాస్తోందని ఆరోపించారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే రాఫెల్ కాంట్రాక్టును అనిల్ అంబానీకి ఇప్పించేందుకు దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతోందన్నారు.

AK Anthony
PMO
Rafel
Anil Ambani
France
  • Loading...

More Telugu News